శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!
పవిత్రమైన శ్రావణ, కార్తీక మాసాలు వచ్చాయంటే నాన్‌వెజ్‌కు డిమాండ్ తగ్గడం సాధారణమే. చాలామంది భక్తులు ఈ మాసాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. కానీ శ్రావణంలోనూ చికెన్ ధరలు నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గతవారం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.200 నుండి రూ.240 మధ్య పలకగా నేడు 220 నుండి 270 వరకు పలుకుతోంది. నిజామాబాద్ లో అత్యధికంగా కేజీ ధర రూ.270 పలుకుతోంది. వరంగల్, సూర్యాపేట, కామారెడ్డి రూ.250గా ఉంది. ఖమ్మంలో రూ.220 నుండి రూ.240 మధ్య అమ్ముతున్నారు. గుంటూరులో కేజీ రూ.260, పల్నాడులో రూ.230 నుండి రూ.250 మధ్య ఉంది. విశాఖ పట్నంలో కేజీ రూ.240 ఉండగా, చిత్తూరులో కేజీ రూ.220గా ఉంది. శ్రావణంలోనూ ధరలు ఈ స్థాయిలో ఉండటంతో చికెన్ లవర్స్ నిరాశ చెందుతున్నారు. మరోవైపు కోడిగుడ్ల ధరలు సైతం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. మటన్ ధరలు కూడా నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. శ్రావణంలో కూడా మటన్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
