తెలంగాణ

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. శ్రావణమాసంలో భారీగా తగ్గిన ధరలు!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం ప్రారంభంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పడిపోయింది. పది రోజుల క్రితం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.310 వరకు ఉండగా.. ప్రస్తుతం ఏపీలో రూ.220 నుంచి రూ.240, తెలంగాణలో రూ.230 నుంచి రూ.250 మధ్యకు చేరింది. అంటే కిలోపై దాదాపు రూ.70 నుంచి రూ.90 వరకు తగ్గుదల కనిపిస్తోంది. గిరాకీ లేకపోవడంతో ధరలు తగ్గించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు తగ్గడంతో చికెన్ ప్రియులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.