తెలంగాణ
ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్‌ను ప్రైవేట్‌పరం చేయం
Power Sector: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మాటల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలది తప్పుడు ప్రచారం ఎదురుదాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్ ను ప్రైవేటుపరం చేయము అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
