తెలంగాణ

నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు

Cm Revanth: నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.