టాప్ న్యూస్
ఏడాదికి 13 కాదు 12 రీచార్జులే.. 30 డేస్ ప్లాన్స్ వచ్చేశాయ్!
దేశంలోని మొబైల్ యూజర్లకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంతకాలం డేటా వినియోగం అవసరం లేకున్నా 1జీబీ లేదా 2జీబీ డేటా ప్లాన్లతో కూడిన రీచార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి వచ్చేది.ఇకమీదట దాని అవసరం లేదని సమాచారం.కేవలం ఏడాదికి 12 సార్లు.. అనగా నెలకు ఒకసారి రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని.. ఈ మేరకు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు నెలలో 28 రోజులకు మాత్రమే డేటా ప్లాన్స్ అందుబాటులో ఉండేవి. ఇకమీదట నెలలో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
