రూ. ‘ఇందిరమ్మ ఇళ్లు’ డిపాజిట్ ఎప్పుడిస్తారు?
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఫిల్టర్ చేసింది. లక్షల్లో దరఖాస్తులు రాగా అందులో అర్హులను గుర్తించి ఇటీవల ఎంపిక చేసిన ప్రాంతాల్లో లక్కీ డ్రా తీసిన విషయం తెలిసిందే. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగింది. అయితే, ఇందిరమ్మ ఇళ్లు లాటరీలో పాల్గొనాల్సిన లబ్దిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.10 వేల డిపాజిట్ కట్టించుకుంది. లాటరీలో ఎంపికైన వారికి ఆ డబ్బులు తిరిగి చెల్లించరు. ఎవరైతే లాటరీలో పేరు రాని వారు ఉంటారో వారికి మాత్రం డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే, మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో 14,201 దరఖాస్తులను ఫైనల్ చేయగా. 1,920 మందికి లాటరీలో ఎంపికయ్యారు. కాగా, ఇళ్లు రాని వారు తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
