ట్యాంక్ బండ్ మీద పుట్టినరోజు వేడుకలు వద్దు : సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ట్యాంక్ బండ్, సచివాలయం ఎదుట కొందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కార్లు, బైకుల మీద వచ్చి కేకు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.దీనికి తోడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజాగా ఈ వేడుకలపై ఘాటుగా స్పందించారు. ట్యాంక్ బండ్ మీద పుట్టిన రోజు సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయొద్దంటూ తల్లిదండ్రులు, యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద కూడా రాత్రిళ్లు బర్త్ డే వేడుకలు జరపవద్దన్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తుండటంపై ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు.
