తెలంగాణ
Nirmal: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!..
నిర్మల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సంచలన దాడి చేశారు. జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్‌ను అనుకూలంగా తయారు చేసేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ స్టేట్ టాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తొలుత లక్ష రూపాయలు డిమాండ్ చేసి.. చివరకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. బాధితుడి ఫిర్యాదుతో వల పన్నిన అధికారులు లంచం నగదు స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.
