తెలంగాణ

NIMS: నిమ్స్‌లో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు.. రోగుల అవస్థలు!

హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ కె.శ్రీకాంత్‌పై రోగి బంధువులు తీవ్ర పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడులకు దిగుతామని బెదిరించారు. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరగగా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (RDA) గురువారం ఉదయం సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ (OPD) సేవలతో పాటు ఎలక్టివ్ సేవలను నిరవధికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.