తెలంగాణ

NIMS : నిమ్స్‌ వెళ్లే వారికి అలర్ట్‌.. పార్కింగ్‌ కోసం వాటినే ఉపయోగించాలి

హైదరాబాద్ లోని ఫేమస్ నిమ్స్ హాస్పిటల్ కు కీలక ప్రకటన చేసింది. నిమ్స్ హాస్పిటల్ లో మూడు నెలల పాటు సీసీ రోడ్ల పనులు దశలవారీగా జరుగుతాయని తెలిపింది. నిమ్స్ ప్రాంగణంలోని పంజాగుట్ట ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్‌నెస్ సెంటర్, ఎన్‌పీఆర్‌ బ్లాక్, యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్న సిబ్బంది పార్కింగ్ స్థలం, నర్సింగ్ హాస్టల్‌కు వెళ్లే మార్గం, డాక్టర్స్ క్లబ్ ఎదురుగా ఉన్న డాక్టర్ల పార్కింగ్ స్థలం, CSSD ,జనరల్ స్టోర్స్‌కు వెళ్లే మార్గం, పోర్టికో, సాధారణ పార్కింగ్ ప్రాంతాల్లో ఈ పనులు కొనసాగుతాయి.