తెలంగాణ
మా సమస్యలు పరిష్కారం అయ్యేలా, న్యాయం జరిగేలా చూడండి- స్వేచ్ఛ న్యూస్‌కు నిమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విన్నపం
NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల గురించి, తమకు జరుగుతున్న అన్యాయం గురించి, నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి స్వేచ్ఛ న్యూస్ కు తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా, తమకు న్యాయం జరిగేలా దారి చూపిస్తారని ఆశిస్తూ వినతిపత్రం అందజేశారు.
నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దొరికే విధంగా చూడాలని కోరారు. నిమ్స్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, అన్యాయాలను, అక్రమ నియామకాలను, అవినీతిపరుల గురించి వివరించే ప్రయత్నం చేశారు.
