తెలంగాణ

రోగులకు నిమ్స్ శుభవార్త.. ఓపీ సేవల సమయం పెంపు

రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే రోగులకు ‘నిమ్స్’ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. ఓపీ(ఔట్ పేషెంట్) సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిమ్స్‌లో అత్యవసర చికిత్సలకు మినహాయించి సాధారణ హెల్త్ చెకప్, అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కోసం వెళ్లే రోగులు తప్పకుండా ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఉదయం 8 గంటల నుంచి కేవలం 11 గంటల వరకే ఓపీ సేవలు మొన్నటివరకు కొనసాగాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. తమ బంధువులు, కుటుంబాల కోసం రాత్రిళ్లు వచ్చి ఆస్పత్రి లేదా హోటల్స్‌లో బస చేసి ఉదయాన్నే ఓపీ తీసుకుని హెల్త్ చెకప్, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లేవారు. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని రోగులు, వారి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి.