సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓ సభలో మాట్లాడుతూ.. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు కర్ణాటక ఎందుకు వెళ్లారని, ఆ విషయం బహిర్గతం చేయాలని ప్రశ్నించారు. మాజీమంత్రి హరీష్ రావుపై బహిరంగంగా “బ్లాక్ మేజిక్”, “క్షుద్ర పూజలు” ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించింది.
