ఏపీ

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం.. ఐఎండీ వర్ష హెచ్చరికలు!

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన వరదల నుంచి కోలుకుంటున్న తీర ప్రాంత ప్రజలు తాజా వర్ష సూచనలతో మళ్లీ కలవరపడుతున్నారు. మయన్మార్, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన ఈ వాయుగుండం, ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు-ఈశాన్య దిశలో సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.