తెలంగాణ
ఎవరి ఓటు ఉంటుంది? ఎవరి ఓటు పోతుంది? నేటి నుంచే కొత్త లెక్క!
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్‌లో జరిగే ప్రతి మార్పు పార్టీలకు కీలకమే. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు తగ్గినా.. మరికొన్ని వేల ఓట్లు కొత్తగా చేరినా.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండొచ్చు
