ఏపీ

రాష్ట్రంలో కొత్త పథకం అమలు.. వైద్యం కోసం కిలోమీటర్లు నడవాల్సిన పనిలేదు!

 ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెలలో పర్యటించిన ఆయన, మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలను అందించే 'ఆరోగ్య రథాలను' జెండా ఊపి ప్రారంభించారు. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు వైద్యం కోసం మైళ్ల కొద్దీ ప్రయాణించే అవసరం లేకుండా, వారి ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలను చేర్చడమే ధ్యేయంగా 'సంజీవని' కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.