వ్యాపారం
హైదరాబాద్లో ఆస్తి రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధన.. సర్కార్ కీలక ఆదేశాలు!
హైదరాబాద్ మహానగర పరిధిలో స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఏదైనా నివాస, వాణిజ్య ఆస్తి లేదా ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇకపై తప్పనిసరిగా ఆస్తి పన్ను గుర్తింపు నంబర్ (PTIN) లేదా ఖాళీ స్థలాల పన్ను గుర్తింపు నంబర్ (VLTIN) ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గుర్తింపు నంబర్ లేకపోతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కూడా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ (IG) బుధవారం అధికారికంగా ఒక కీలక మెమోను జారీ చేశారు.
