International
హెచ్-1బీ వీసాలపై కొత్త రూల్.. కలిసిపోయిన 22 అమెరికా రాష్ట్రాలు!
అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా 103,265డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీ ఫీజు విధించాలని ట్రంప్ యాజమాన్యం చేసిన నూతన ముసాయిదా ప్రతిపాదనపై యూఎస్ రాజకీయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ సహా మొత్తం 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమయ్యారు. ఈ ప్రతిపాదన అత్యంత హానికరం, చట్టవిరుద్ధం అని పేర్కొంటూ యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు వారు సంయుక్తంగా అధికారిక నిరసన లేఖను పంపించారు.
