తెలంగాణ
హైదరాబాద్-అమరావతి మధ్య కొత్త ప్రాజెక్ట్!
తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మచిలీపట్నం (బందరు) పోర్టుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఒకే కారిడార్లో హైస్పీడ్ రైల్వే లైన్, 12లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను పక్కపక్కనే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుత హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఒకవైపు ఎక్స్ప్రెస్వే, మరోవైపు రైలు మార్గం ఉండేలా ప్రాథమిక అలైన్మెంట్ ఖరారైంది. మొత్తం 760 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ వ్యయం సుమారు రూ.2.24 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
