రాజకీయాలు
ఢిల్లీలో కొత్త పొలిటికల్ వార్: 'సీజేపీ'కి పోటీగా 'లాల్ హిట్ జనతా పార్టీ' ఆవిర్భావం!
దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో నిరసనలు చేపడుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో సరికొత్త గ్రూప్ రంగంలోకి దిగింది. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ (Lal Hit Janata Party) పేరుతో ఆవిర్భవించిన ఈ నూతన వేదిక.. దేశ రాజ్యాంగ సంస్థలకు మద్దతుగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. ఢిల్లీలోని మాలవియా స్మృతి భవన్లో ‘లాల్ హిట్ జనతా పార్టీ’ చీఫ్ అయాన్ భట్నాగర్ ఆధ్వర్యంలో తొలి సభ్యత్వ సమావేశం ఘనంగా నిర్వహించారు.
