ఏపీ
ఏపీలో కొత్త పొలిటికల్ పార్టీ.. రీఎంట్రీపై విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన!
వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై నడుస్తున్న ఊహాగానాలకు తెర దించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్ని ప్రకటించారు. వైఎస్సార్సీపీలోకి మళ్లీ వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేశారు. సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రజల తరఫున నిజాయితీగల గొంతుకగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సేవలోకి పునఃప్రవేశిస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
