తెలంగాణ

కొత్త పింఛన్ పరేషాన్.. కుమ్మక్కైన అధికారులు, లీడర్లు!

రాష్ట్రంలో కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు ‘దసరా’లోపు ఇస్తామని నిన్న మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. కొందరు అధికారులు, లీడర్ల కుమ్మక్కై నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అత్యంత పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వెరిఫికేషన్ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.కేవలం దరఖాస్తుదారులనే కాకుండా ఇరుగుపొరుగు వారిని సైతం అడిగి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చిన సమాచారం తప్పా? ఒప్పా? అని అడిగి మరీ ఎంట్రీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, వెరిఫికేషన్ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలు విని కొత్త పింఛన్ దరఖాస్తుదారులు షాక్ అవుతున్నట్టు సమాచారం.