తెలంగాణ

సైబరాబాద్, లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే రూట్లు

One Way: కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే విధానం అమలుతో ట్రాఫిక్ కదలికలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు లక్డీకాపూల్‌లోనూ ఇలాంటి మార్పులకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రద్దీ తగ్గించడం, జంక్షన్ల వద్ద వెయిటింగ్ టైమ్‌ను తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించారు.

మై హోమ్ భూజా వరకు వన్‌వే లూప్‌

సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్ సీ-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా మై హోమ్ భూజా వరకు వన్‌వే లూప్‌ను ప్రతిపాదించారు. ట్రాఫిక్ సిమ్యులేషన్లు నిర్వహించి, ఐటీ కంపెనీలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాత దశలవారీగా అమలు చేయనున్నారు.