తెలంగాణ
‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ కోసం కొత్త ఇన్చార్జీలు.. కేటీఆర్ టార్గెట్ రీచ్ అవుతారా?
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయపతాకం ఏగరేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ తరఫున బిగ్ షాక్ తగిలింది.ఈసారి అలా కాకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ‘ఖమ్మం–వరంగల్–నల్గొండ’, ‘మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కొత్త ఇన్చార్జిలను నియమించారు.
