National
NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!
భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన దౌత్య ఒత్తిడి కారణంగా తన వైఖరిని సవరించుకుంది. భోటేకోశీ పరివాహక ప్రాంతాల్లో వందలాది మంది విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో, సాంకేతిక, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల బృందాలను మాత్రమే తమ దేశంలోకి అనుమతించేందుకు నేపాల్ సర్కార్ సానుకూలంగా స్పందించింది.
