International
ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..
ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలం అయింది. ముఖ్యంగా బోటెకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వల్ల అనేక గ్రామాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రాకాసి వరదల ధాటికి ఇప్పటి వరకు సుమారు 1300లకు పైగా మృతదేహాలను వెలికి తీయగా, మరో 4,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు నేపాల్ ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విపత్తులలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ సహా అనేక దేశాలు నేపాల్‌కు ఆపన్న హస్తం అందించాయి. అయితే, ఆపత్కాలంలో అండగా నిలిచిన దేశాల పట్ల కృతజ్ఞత ప్రకటించాల్సిన నేపాల్, అనూహ్యంగా ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. తమకు కావాల్సింది సాయం కాదు, క్లైమేట్ జస్టిస్ అని స్పష్టం చేసింది.
