International

నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..

నేపాల్ హిమాలయాల్లో సంభవించిన పెను విపత్తు.. ఊహించని బీభత్సాన్ని సృష్టించింది. గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మంచు, రాళ్లు, బురద వరద.. మార్గంలోని ప్రాంతాలను ముంచెత్తింది. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శ్రేణిలో 16,700 అడుగుల ఎత్తు నుంచి భారీ మంచు శిఖరం విరిగిపడింది. దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పున్న ఈ మంచు పర్వతం నదిలో కుప్పకూలడంతో 300 అడుగుల ఎత్తున రాకాసి అల ఎగసిపడింది. ఆ వరద ధాటికి గిరాంగ్ పోర్ట్ ప్రాంతం క్షణాల్లోనే జలసమాధిగా మారింది. వాతావరణ మార్పులే ఇలాంటి విపత్తులకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.