National

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..

నేపాల్‌లో ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్ర చేసింది. రసువా జిల్లాలో భోటేకోషి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో డజనుకు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహానికి జనావాసాలు కొట్టుకుపోగా.. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు. వెయ్యి మందికి పైగా గల్లంతై ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు వేల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికారులు చెబుతున్నారు. బాధితుల కోసం సైనిక హెలికాప్టర్లతో సహా భారీగా రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.