International

నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..

నేపాల్ ఆకస్మిక వరదలపై ఐదు నెలల ముందే ప్రమాద ఘంటికలు మోగినట్టు కథనాలు వెలువడుతున్నాయి.. ఖాట్మండు కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ ఈ ఏడాది మార్చిలోనే హిందూకుష్ హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని రెండు నివేదికల ద్వారా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతుంది.. మరోవైపు 2000 సంవత్సరం నుంచి హిందూకుష్ హిమాలయాల్లో మంచు కరిగే వేగం రెట్టింపు అయిందని ఐసీఐఎంఓడీ తాజాగా నివేదిక వెల్లడించింది.. 1975 నుంచి ఇప్పటివరకు దాదాపు 27 మీటర్ల మంచు పొర కరిగిపోయిందని, 1990-2020 మధ్య కాలంలో ఈ ప్రాంతంలోని హిమానీనదాలు తమ మొత్తం విస్తీర్ణంలో 12 శాతం, మంచు నిల్వల్లో 9 శాతాన్ని కోల్పోయినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని, ఈ విపత్తును ఆపడం సాధ్యం కాకపోవచ్చని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది.