ప్రపంచం

Nepal : 11 రోజుల తర్వాత ప్రాాణాలతో బయటపడ్డ వృద్ధురాలు

నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రూ. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే, నేపాల్‌లో తాజాగా మరో మిరాకిల్ చోటుచేసుకుంది. వరదలు సంభవించిన 11 రోజుల తర్వాత 64 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. వరదల ధాటికి నువాకోట్‌లో చందిక శ్రేష్ఠ(64) 11 రోజుల పాటు ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పోలీస్ ఫోర్స్ ఆమెను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు.