National
నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన సీబీఐ!..
NEET-UG పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో 13 మంది ప్రధాన నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. నిందితులపై ఆరోపణలను బలపరిచేందుకు 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 డిజిటల్ ఆధారాలను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. ఇక ఒక్కో ప్రశ్నాపత్రానికి రూ.10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేపు కోర్టులో కీలక వాదనలు జరగనుండటంతో.. ఈ కేసు విచారణపై ఉత్కంఠ నెలకొంది.
