క్రైమ్

హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్ లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి సూసైడ్ చేసుకుంది. యువతిని కర్నూలుకు చెందిన యశ్వితగా గుర్తించారు. ఆరు నెలలుగా ఆమె హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతోంది. పరీక్షల మానసిక ఒత్తిడే బలవన్మరణానికి కారణం అని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. యశ్వితను కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తెగా గుర్తించారు. యశ్విత మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.