తెలంగాణ
నీట్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. మెడికల్ సీట్లు భారీగా పెంపు!
ఎంబీబీఎస్ విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,839 పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో గతేడాది 3,721గా ఉన్న మొత్తం పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుత విద్యా సంవత్సరానికి 4,417కు చేరింది.అనగా 696 సీట్లు అదనంగా పెరిగాయి. ఏపీలో 3,908 నుంచి 4,316 చేరగా.. 408 సీట్లు అదనంగా పెరిగాయి. ఇదిలాఉండగా, గతంలో కేవలం పది కాలేజీల్లోనే పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండగా.. ఇప్పుడు మరో 13 కాలేజీలకు ఆ సౌకర్యం పెరిగింది. నాగర్కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్, సంగారెడ్డి, నర్సంపేట కాలేజీలకు తొలిసారిగా పీజీ సీట్లను పెంచనున్నట్టు సమాచారం.
