National
నీట్ వివాదం: కేంద్రంపై రాహుల్ గాంధీ, జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు!
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని మరింత పదునుపెట్టాయి. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంతో పాటు, ఈ అక్రమాలకు కారణమైన వారిని ప్రభుత్వమే వెనుకేసుకొస్తోందని విపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
