క్రీడలు

Neeraj Chopra: 'ప్రతి త్రో ముందు భయంతో వణికిపోయా'.. నీరజ్ చోప్రా భావోద్వేగం!

సుదీర్ఘ విరామం, గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ పతకాల వేదికపై మెరిసిన భారత జావెలిన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం మాట్లాడిన అతడు, పోటీ సమయంలో ప్రతీ త్రో విసిరే ముందు ఎక్కడ పాత గాయం తిరగబెడుతుందోనన్న తీవ్ర భయం తనను వెంటాడిందని వెల్లడించాడు.