సినిమా
NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!
NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వాస్తవానికి, ఈ నెలలో షూటింగ్ కూడా మొదలవ్వాల్సింది. కానీ, తాజా సమాచారం మేరకు, ఇప్పుడీ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి, కారణం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే రెమ్యునరేషన్ కాకుండానే 150 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. ఈ బడ్జెట్ పెట్టొద్దనే బాలయ్య ఆపేయమన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
