సినిమా
ఆగిపోలేదు..ఏకంగా షూటింగే స్టార్ట్ అవుతోంది!
NBK 112: ఎన్బికే 112 ఈ ఆగస్టు నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం. బాలయ్య డేట్స్ ఇవ్వడంతో ఆగస్టు చివరి వారంనుంచి, ఆయన లేని సన్నివేశాలను ఇతర తారాగణంపై ప్లాన్ చేస్తున్నాడట. సెప్టెంబర్ చివరి వారం నుంచి బాలయ్య సెట్స్‌లో జాయిన్ అవుతాడట. సో మొత్తానికి అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందనని వస్తున్న వార్తలకి అధికారికంగా ఈ నెలలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. కొరటాల సినిమా అంటే పవర్ ఫుల్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇక, బాలయ్య అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబోలో వచ్చే సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.
