National

తికమక పెట్టిన ‘నేహా బోరా’ ప్రింట్.. షాక్‌లో ఢిల్లీ పోలీసులు!

జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లోనూ నేహాబోరా పోలీసుల కళ్లు గప్పి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని భావించిన ఖాకీలకు ఊహించని షాక్ తగిలింది. నిరసన సమయంలో అచ్చం నేహాబోరా లాగే ఉన్న ఓ అమ్మాయి పోలీసుల దృష్టిని ఆకర్షించింది. కళ్లద్దాలు పెట్టుకుని ఫేస్ మాస్క్ పెట్టుకుని ఆమెను చూసి నిజమైన నేహాబోరా అనుకుని పోలీసులు అరెస్టు చేశారు.తీరా చూస్తే అసలైన నేహాబోరా నిరసనల్లో పాల్గొని నినాదాలు చేయడం పోలీసుల కంట పడింది. దీంతో ఒకరికి బదులు మరొకరిని అరెస్టు చేశామని పోలీసులు నాలుక కరుచుకున్నట్టు తెలిసింది. ఆర్కే ఆశ్రమం వద్ద మాస్కుతో ఉన్న అమ్మాయిని చూసి నేహా బోరానే అనుకొని ఆమెను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా మారింది.