వ్యాపారం

National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై రూ.20 వేల వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సవరించిన ధరలు సెప్టెంబర్ నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. కాగా.. ఈ ఏడాది మే నెల నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.