National
National Politics: కాంగ్రెస్ క్రెడిట్‌కు CJP అడ్డు.. ప్రతిపక్షాల విభేదాలతో బీజేపీకి లాభమేనా?!
ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యమాలకు, ఉద్యమ పార్టీలకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ఉద్యమాలు, ఆ ఉద్యమాలు చేసే పార్టీలు సొంతంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.. ఒక పార్టీ అధికారం సొంతం చేసుకోవాలంటే వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం వేరు.. ఎలాగో అధికారంలోకి వచ్చాక అందరినీ తనలో కలిపేసుకుని నోరెత్తకుండా చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం..
కానీ ప్రస్తుతం దేశ రాజకీయాలు కాంగ్రెస్ చుట్టూ కాకుండా బొద్దింకల చుట్టూ తిరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. బీజేపీని పడగొట్టాలంటే కాంగ్రెస్ ఎత్తులు సరిపోవడం లేదని.. ఇది వరకు ఇండియా కూటమి అని ఏర్పాటు చేసి నవ్వులపాలైన హస్తం ఇప్పుడు బొద్దింకలను అడ్డుపెట్టుకుని కొత్త రాజకీయాలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
