తెలంగాణ

జాతీయ పార్టీలు తెలంగాణను ముంచుతున్నాయి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ధ్వజం!

 ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాశనం చేస్తున్నాయని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని పెద్దన్న, ఇక్కడ రాష్ట్రంలోని చిన్నన్న ఇద్దరూ చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించడంలో, ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.  రైతాంగ సమస్యలు, దెబ్బతిన్న పంటల గురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తే, బీజేపీ ఎంపీలు భిక్షాటన లంకెతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు.