National: నిరసనల వెనుక విపక్షాల కుట్ర?!.. వీరి అంతిమ అజెండా ఇదేనా?..
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపై విడుదల చేసిన గణాంకాలు, దానికి ప్రతిపక్షాలు చూపిస్తున్న నిరసన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 13 కోట్ల 39 లక్షల ఓట్లను తొలగించింది. ఇందులో మరణించిన వారివి 2 కోట్ల 80 లక్షలు కాగా, రెండు చోట్ల ఉన్న నకిలీ ఓట్లు కోటి రెండు లక్షలు. ఇక 6 కోట్ల 30 లక్షల మంది శాశ్వతంగా స్థానం మారగా, 3 కోట్ల లక్ష మంది ఇచ్చిన చిరునామాలో లేరు. మరో 26 లక్షల ఓట్లను ఇతర సాంకేతిక కారణాలతో తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.. అయితే వీటన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ పక్కా ఆధారాలు చూపిస్తున్నప్పటికి విపక్షాలు మాత్రం ఏ ఒక్క నిరూపణా లేకుండా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ వీధుల్లో ఆందోళనలకు దిగడం వెనుక ఉన్న కారణం ఏంటనేది అర్థం కానీ ప్రశ్నలా మిగిలిందనే సందేహాలు తలెత్తుతున్నాయి..
