National
ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సెప్టెంబర్ 11న సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.స్కేల్ IV, అంతకంటే ఎక్కువ కేడర్ అధికారుల కోసం తెచ్చిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంపై అభ్యంతరాలు.. పెన్షన్ సవరణలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
