National
ఈవీ వెహికిల్స్‌కు పెద్దపీట.. కేంద్రం కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉపయోగించే అధికారిక వాహనాల కొనుగోలు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టును ప్రోత్సహించడంతో పాటు ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకమీదట ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగించి కొత్తవి కొనుగోలు చేసే టైంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. అందుకే ఈవీ కార్ల కొనుగోలు ధర పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచినట్టు తెలిసింది.
