National

బీజేపీలో బిగ్ ఛేంజ్.. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు నో ఛాన్స్!..

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి చోటు దక్కింది. అయితే తెలంగాణ నేతలకు మాత్రం జాతీయ కార్యవర్గంలో స్థానం లభించలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ తదితరులకు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ మోర్చాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.