National
National: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా సేవలు!
అయిదు రోజుల పనివారంతో పాటు తమ డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) హామీ ఇవ్వడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చిన ఈ సమ్మె నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.
