తెలంగాణ
Nandini Mallu: వివాదంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై లంచం ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి నందిని 10శాతం లంచం అడిగారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఆ ఆరోపణల ఆధారంగా భట్టి విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతల రేవంత్. ఉప ముఖ్యమంత్రి భట్టి భార్యపై వచ్చిన లంచం ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్రం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు మెయిల్ ద్వారా పంపినట్లు న్యాయవాది తెలిపారు.
