సినిమా
Nandamuri Mokshagna-Debue: మోక్షజ్ఞ డెబ్యూ..రీల్ లైఫ్‌లోనూ తండ్రిగా బాలయ్య!
Nandamuri Mokshagna: గత నాలుగైదేళ్ళుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా అప్పట్లో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండేవాడు. హీరోగా పరిచయం కాబోతున్నాడు..అని వార్తలు వస్తున్నా కూడా తన ఫిజిక్ చూస్తే సినిమాలపై ఆసక్తి లేదని చెప్పుకున్నారు. ఎట్టకేలకి, మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దసరాకి ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా ఓపెనింగ్ జరగనుందని సమాచారం.
