తెలంగాణ

Nanakramguda Land Dispute: నానక్‌రామ్‌గూడ భూవివాదంపై చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ

Nanakramguda Land Dispute: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ భూ వివాదంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని పేర్కొంటూ ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

నానక్‌రామ్‌గూడ పరిధిలో రైతుల నుంచి తాము నిబంధనల ప్రకారమే 10 ఎకరాల స్థలాన్ని కొన్నామని తెలిపారు. తాను, సునీల్‌ కలిసి ఈ ల్యాండ్ తీసుకున్నామని.. ఇందులో సునీల్‌ వాటాగా 3 ఎకరాలు ఉందని వెల్లడించారు.