టాప్ న్యూస్

NALSAR : నల్సార్ విద్యార్థులపై బీసీఐ బ్యాన్.. అంతలోనే విత్ డ్రా.. అసలేమైంది?

హైదారాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ లా కాలేజీపై తీవ్ర వివాదం చెలరేగింది. జెన్ జీని బొద్దింకలతో పోల్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకోబోమని నల్సార్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొందరు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. NALSAR న్యాయ కళాశాల విద్యార్థుల నమోదున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.